వేసవిలో శరీరానికి చల్లదనం చాలా అవసరం. పై నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, ఒంట్లో ఉన్న శక్తంతా ఆవిరైపోతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు శక్తిని తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాని కోసం మంచి మంచి ఆహారాలని తీసుకోవాల్సి ఉంటుంది. మీలో శక్తి తగ్గకుండా ఉండాలంటే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి చాలా ఆహారాల్లో సబ్జా గింజలు కూడా ఒకటి. ఇవి శరీరానికి చల్లదనాన్ని చేర్చి, మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
అందుకే మీ డైట్ లో సబ్జా గింజలని చేర్చుకోండి. రుతువు మారడం వల్ల వచ్చే ఇబ్బందులని దూరం పెట్టడానికి ఆ రుతువులో ఏమి తింటే బాగుంటుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈ రోజు సబ్జా గింజల గురించి తెలుసుకుందాం.
సబ్జా గింజల ఉపయోగాలు..
ఇవి సహజ సిద్ధంగా శరీరంలోని విష పదార్థాలను బయటకి పంపించివేస్తాయి. అసిడిటీ, తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నట్లయితే సబ్జా గింజలు చాలా మేలు చేస్తాయి.
ఆల్ఫా లైపోక్ ఆమ్లం అధికంగా ఉండడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
ఇందులో ఉండే అధిక శాతం ఫైబర్ కంటెంట్, మీ పొట్టని నిండినట్లుగా ఉంచి అనవసర ఆకలిని తగ్గిస్తుంది.
సబ్జా గింజలని ఎలా తినాలి?
గంట పాటు సభా గింజలని నీళ్ళలో నాన బెట్టాలి. ఆ తర్వాత వాటిని పెరుగు, బట్టర్ మిల్క్, షర్బత్ వంటి వాటితో కలుపుకుని తినవచ్చు. లేదా, గ్లాసు నీళ్ళలో సబ్జా గింజలని వేసి, అందులో కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర కలుపుకుని తిన్నా బాగుంటుంది.