వంకాయ తో వంటలు చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ అందాన్ని పెంపొందించవచ్చు అని చాలా మందికి తెలియదు. నిజంగా దీనిని చూశారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే..! వంకాయ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇంత ఆరోగ్యకరమైన ఈ కాయగూర లో అందాన్ని పెంపొందించే గుణాలు కూడా ఉన్నాయి. మరి వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
చర్మాన్ని మృదువుగా మారుస్తుంది:
వంకాయలో 92 శాతం నీళ్లు ఉంటాయి. దీనిలో ఉండే నీళ్లు చర్మాన్ని డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంచడానికి సహాయ పడుతుంది. అలానే ఇది మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది కూడా.
స్కిన్ టోనర్ గా పని చేస్తుంది:
వంకాయ స్కిన్ టోనర్ గా కూడా పని చేస్తుంది. అయితే దీని కోసం మీరు వంకాయ తీసుకొని జ్యూస్ కింద చేయండి. కొద్దిగా ఈ జ్యూస్ ని తీసుకుని విచ్ హ్యజర్ లో మిక్స్ చేయండి. దీనిని కాసేపు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత స్కిన్ టోనర్ కింద ఉపయోగించండి. ఇలా తరచూ చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది మరియు మృదువుగా ఉంటుంది.
యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది:
దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. మరియు క్యాన్సర్ ని నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. వంకాయ తొక్కని ఉపయోగించడం వల్ల ముడతలు, డార్క్ స్పాట్స్ వంటివి తగ్గిపోతాయి.
జుట్టు ఎదుగుతుంది:
వంకాయ జుట్టు ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే వంకాయని జుట్టుకి, మాడుకి పట్టించడం వల్ల సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయి.