వాట్సప్‌లో ఈ సెట్టింగ్‌ చాలా ముఖ్యం!

-

వాట్సాప్‌లో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ సెట్టింగ్‌ను మార్చాలనుకుంటున్నారా? అవును ఇది కచ్చితంగా మార్చాలి. దీని వల్ల మీ వాట్సాప్‌ ఖాతా భద్రంగా ఉంటుంది. అయితే వెంటనే మీ ఫోన్లోని వాట్సాప్‌ సెట్టింగ్‌ని మార్చేయండి. అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద వాట్సాప్‌ కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యాప్‌తో కేవలం సందేశాలు పంపించడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ, వాట్సాప్‌లో అనేక కొత్త ఫీచర్‌లు మనకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వాట్సాప్‌తో ఫోటోలు, వీడియలు, ఆడియో ఫైళ్లను కూడా షేర్‌ చేసుకుంటున్నాం. వీడియో కాల్‌ కూడా చేసుకోవచ్చు, వాయిస్‌ కాల్‌ కూడా చేసుకోవచ్చు. కాబట్టి చాలా మంది వాట్సాప్‌ యాప్‌ వాడటానికే మొగ్గు చూపుతారు. అయితే వినియోగదారులు యాప్‌ ప్రైవసీ, భద్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మీ స్మార్ట్‌ ఫోన్‌ వేరే వారు వాడినా ఈజీగా యాక్సెస్‌ చేయవచ్చు. మీరు వాడిని సిమ్‌ ద్వారా ఇతర ఫోన్‌లో వేసి కూడా వాట్సాప్‌ ఖాతా ఇన్‌స్టాల్‌ చేసి, మీకు సంబంధించిన ఫైల్స్‌ రీస్టోర్‌ చేయవచ్చు. ఎప్పుడైనా మీరు మీ ఫోన్‌ పోగొట్టుకున్నా, దొరికిన వారి చేతుల్లోకి మీ వాట్సాప్‌ ఖాతా కూడా పోయినట్టే. అందుకే మనం సెక్యూరిటీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వాట్సాప్‌ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌

వాట్సాప్‌ అందిస్తోన్న అనేక ఫీచర్లలో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ చాలా ముఖ్యమైంది. ఈ ఖాతాను మన సిమ్‌ కార్డుతో 6 అంకెల కోడ్‌ ద్వారా క్రియేట్‌ అయిపోతుంది. ఇతరులకు మీ సి మ్‌ కార్డు దొరికితే ఇలా ఇన్‌స్టాల్‌ చేయకుండా మనం ఈ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ద్వారా అడ్డు కోవచ్చు. దీనివల్ల మీరు కొత్త స్మార్ట్‌ఫో¯Œ లో వాట్సప్‌ అకౌంట్‌ క్రియేట్‌ కావాలంటే 6 అంకెల కోడ్‌ మాత్రమే కాదు, మీరు క్రియేట్‌ చేసిన మరో 6 అంకెల కోడ్‌ కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. టూ–స్టెప్‌ వెరిఫికేషన్‌ సెట్టింగ్స్‌ ద్వారా మీరు 6 అంకెల కోడ్‌ను మరో అదనపు సెక్యూరిటీ ఫీచర్‌గా ఉపయోగపడుతుంది.

  • ముందుగా మీ వాట్సప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, పైన కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేయండి.
  • సెట్టింగ్స్‌ ఓపెన్‌ చే సి, ఆ తర్వాత అకౌంట్‌ ఓపెన్‌ చేయండి.
  • Two & step & verification పైన క్లిక్‌ చేయండి.
  •  తర్వాత ఆరు అంకెల పిన్‌ ఎంటర్‌ చేయండి.
  • కానీ, మీరు ఈ పిన్‌ ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ లో వాట్సప్‌ యాప్‌ అన్‌ ఇన్‌ స్టాల్‌ చేసి మళ్లీ ఇన్‌ స్టాల్‌ చేసిన తర్వాత అకౌంట్‌ లాగిన్‌ కావాలంటే దీనికి 6 అంకెల పిన్‌ తప్పనిసరి.

ఇలా మీరు వాట్సప్‌లో టూ–స్టెప్‌ వెరిఫికేషన్‌ సెట్టింగ్స్‌ చేస్తారు కాబట్టి ఎవరైనా మీ వాట్సప్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేసినా వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలంటే ఈ పిన్‌ అవసరం. అప్పుడు మీ ఖాతా భద్రంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news