హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించనున్నారు. ఈ ఫెస్టివల్‌కి ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కానుక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వనుంది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేలు రాబోతున్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడ్వాన్స్‌గా రూ.10 వేలను ఇవ్వనున్నారు. అయితే ఎలాంటి వడ్డీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సినవసరం లేదు.
అయితే ఈ స్కీమ్ ని పొందాలంటే మార్చి 31, 2022 ఆఖరి తేదీ. గతేడాది కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందే ఈ డబ్బులను 10 ఇన్‌స్టాల్‌మెంట్లలో తిరిగి చెల్లించుకోవచ్చు.
నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌గా కేవలం రూ. వెయ్యి చెల్లిస్తే సరి పోతుంది. ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద రూ.4 వేలు నుంచి రూ.5 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్‌ను అమలు చేయాలనుకుంటే రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ అడ్వాన్స్ ని డిజిటల్‌గానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖర్చు చేయాలి.