బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్. కంటెస్టెంట్లు వీరే..!

-

బిగ్ బాస్ కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు సాధారణంగా ఉన్న వ్యక్తులను ఓవర్ నైట్ లోనే స్టార్లుగా మారుస్తోంది బిగ్ బాస్. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అయింది. ఇన్నాళ్ల పాటు బుల్లితెర అభిమానులనే ఆకట్టుకున్న బిగ్ బాస్ ఫిబ్రవరి 26 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ డిస్నీ హాట్ స్టార్ లో 24 అవర్స్ ప్రసారం కోబోతోంది. దీంతో బిగ్ బాస్ లవర్లకు ఇక పండగే. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తియి…వారిందరిని క్వారంటైన్ కు తరలించారు.

అయితే ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరెవరనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లు ఇవే అంటూ… కొందరి పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఓటీటీలోకి ఓ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుంది.

ఆవకాయ్ బిర్యానీ, పిల్ల జమిందార్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్ను బింధు మాధవి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు క్విజ్ పెట్టారు. దీంతో మొహం కనిపించకుండా కంటెస్టెంట్ పేరు కనుక్కోవాలని కోరారు. దీంతో ఈ ఫోటో బింధు మాధవిదే అంటూ ట్విట్లు చేశారు.

కంటెస్టెంట్లు వీరే..!

ఇక మాధవితో పాటు ఈ షోలో కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1 కంటెస్టెం ట్), ఆదర్శ్ (సీజన్ 1 రన్నర్), ముమైత్ ఖాన్ (సీజన్ 1 కంటెస్టెం ట్), రోల్ రైడా (సీజన్ 2 కంటెస్టెం ట్), తేజస్వి (సీజన్ 2 కంటెస్టెం ట్),అషు రెడ్డి (డ్డి సీజన్ 3 కంటెస్టెం ట్), అరియానా గ్లోరిగ్లో (సీజన్ 4 కంటెస్టెం ట్),మహేశ్ విట్టా (సీజన్ 4 కంటెస్టెం ట్), సరయు (సీజన్ 5 కంటెస్టెం ట్), హమీదా (సీజన్ 5 కంటెస్టెం ట్) నటరాజ్ మాస్టర్స్ట (సీజన్ 5 కంటెస్టెం ట్),యూట్యూబర్, యాంకర్ నిఖిల్ ,యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, యాంకర్ శివ , చిచ్చా చార్లెస్ , అజయ్ కతుర్వార్, రోల్ రైడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎంత మంది ఆఫీయల్ గా హౌజ్ లోకి వస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news