వారి కోసం అదిరే స్కీమ్.. ఏకంగా ఒక్కొక్కరికి రూ.75 వేలు.. పూర్తి వివరాలివే..!

-

ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వచ్చాయి. ఈ స్కీమ్స్ వలన అదిరే లాభాలను మనం పొందొచ్చు. అయితే కేంద్రమే కాకుండా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్నో రకాల స్కీమ్స్‌ను అమలు చేస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాల వల్ల చాలా మంది లాభం పొందుతున్నారు.

money

అయితే ఏపీ సర్కార్ అందిస్తున్న పథకాల్లో వైఎస్సార్ చేయూత కూడా ఒకటి. మరి ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం. ఈ స్కీమ్ కి అర్హులైతే మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం ఇస్తారు. ఇవి విడతల వారీగా లబ్ధిదారులకు ఇస్తారు. ఒక్కో విడతకు రూ.18750 లభిస్తాయి.

స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:

ఈ చేయూత పథకంలో చేరాలని అనుకునే వాళ్లకి కచ్చితంగా ఈ అర్హతలు ఉండాలి. లేదంటే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ని పొందడం అవ్వదు. మరి ఇక వాటి కోసం చూసేస్తే…
ఈ స్కీమ్ లో చేరాలి అంటే 45 ఏళ్ల వయసు తప్పనిసరి.
60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పథకంలో చేరొచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఆధార్ లో వయస్సుని బట్టి చూస్తారు.

వైఎస్సార్ చేయూత స్కీమ్ లో చేరాలంటే ఈ డాక్యుమెంట్స్ కావాలి:

చిరునామా రుజువు
ఆధార్ కార్డ్
క్యాస్ట్ సర్టిఫికెట్
నివాస ధృవీకరణ పత్రం
ఏజ్ ప్రూఫ్
బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
మొబైల్ నంబర్
రేషన్ కార్డు

వైఎస్సార్ చేయూత స్కీమ్ వలన కలిగే ఇతర లాభాలు:

ఈ స్కీమ్ లో చేరడం వలన మరో లాభం కూడా వుంది. అదేమిటంటే..? ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు కూడా ప్రభ్త్వమే ఏర్పాటు చేయిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌, రిలయన్స్‌, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది. మీరు నేరుగా అధికారిక సైట్ నుండి ఈ స్కీమ్ కోసం అప్లై చెయ్యచ్చు. మరిన్ని వివరాలను కూడా చూడచ్చు.

అధికారిక వెబ్‌సైట్- https://navasakam.ap.gov.in/

 

Read more RELATED
Recommended to you

Exit mobile version