LIC: ఈ మైక్రో ప్లాన్ వలన ఎన్ని లాభాలో తెలుసా..?

-

ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే మీరు తక్కువ బీమా మొత్తానికే ఈ పాలసీ తీసుకోవచ్చు. దీని వలన మీరు డబ్బులు కూడా ఎక్కువగా పెట్టక్కర్లేదు. దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎన్నో పాలసీలని అందిస్తున్న సంగతి తెలిసినదే. వీటిల్లో మైక్రో పాలసీలు కూడా ఒక పార్ట్ అని మనం చెప్పొచ్చు. అయితే తక్కువ ఆదాయం కలిగిన వారు ఎంతో ఈజీగా వీటిని తీసుకోవచ్చు. దీనితో ఎల్‌ఐసీ మైక్రో పాలసీలు వలన కలిగే లాభాలని పొందొచ్చు.

ఇక మైక్రో పాలసీల విషయానికి వస్తే… ఎల్‌ఐసీ మైక్రో పాలసీల్లో భాగ్య లక్ష్మీ ప్లాన్ ఒకటి. మీరు కనుక ఈ పాలసీ తీసుకోవడం మెచ్యూరిటీ సమయం లో కచ్చితంగా డబ్బులు తీసుకోవచ్చు. అలానే పాలసీ కాలం లో పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం మొత్తంలో 110 శాతానికి సమానమైన డబ్బును చెల్లిస్తారు. అయితే ఒకవేళ కనుక ఆ పాలసీదారుడు పాలసీ గడువు లో చనిపోతే అప్పుడు బీమా మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. వాటిని నామినీ పొందవచ్చు.

ఇక ఈ పాలసీకి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే…18 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 55 ఏళ్ల లోపు వరకు పాలసీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఐదేళ్ల నుంచి 13 ఏళ్ల వరకు పాలసీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ.20 వేల నుంచి రూ.50 వేల మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ మీరు చెల్లించే ప్రీమియం కాలానికి రెండేళ్లు ఎక్కువగా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news