నేటి కాలం లో చాల సమస్యలు వస్తున్నాయి. ఇటుంవటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే డైట్ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యం మరెంత మెరుగు పడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తిమీర శరీరం నుంచి సోడియంను బయటకు తొలగించడానికి సహాయ పడుతుంది. అలానే ఆహారానికి తాజాదనాన్ని ఇస్తుంది. కొత్తిమీరని తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, అధిక రక్తపోటును తగ్గించడం లో కూడా సహాయ పడుతుంది. కాబట్టి మీ డైట్ లో దీనిని చేర్చండి.
ఆయుర్వేద మందుల్లో ఉపయోగించే తులసి లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి. తులసిలో యూజీనాల్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడం లో కూడా సహాయ పడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని లోని నూనెలు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి కూడా సహాయ పడతాయి. రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. కనుక దీనిని కూడా విరివిగా తీసుకుంటే మంచిది.
ఇది ఇలా ఉండగా పుదీనా కూడా ఒంటికి మంచిది. ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో మంచి ఔషధంగా పని చేస్తుంది పుదీనా. దీనిని నిమ్మరసం, మజ్జిగ ఇలా ఎందులోనైనా వేసుకుని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీని వల్ల ఒత్తిడిని కూడా తగ్గించుకో వచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడతాయి. రోజ్ మేరీ కూడా తీసుకోవడం మంచిదే. గుండె పోటు ప్రమాదాన్నిఇది తగ్గిస్తుంది. వీలైనంత వరకు వీటిని వంటల్లో వాడండి. అనేక సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు