అర్థకాని టైటిల్‌ పెట్టి.. పూరీ మార్కులు కొట్టేశాడా ?

-

ఇడియట్‌ అంటే వెదవ అని అర్థమైపోతుంది. టైటిల్‌గా లోఫర్‌ అని పెడితే పనికిరానివాడని అర్థం. కానీ.. విజయ్‌దేవరకొండ సినిమాకు పెట్టిన టైటిల్‌కు మీనింగ్‌ తెలియాలంటే.. గూగుల్‌నే నమ్ముకోవాలి. మీనింగ్‌ అందరికీ తెలీకపోయినా.. మరోసారి డిఫరెంట్ టైటిల్‌తో వచ్చాడు పూరీ. ఇంతకీ.. విజయ్‌ దేవరకొండకు పెట్టిన పవర్‌ఫుల్‌ టైటిల్‌ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ కు కారణమైంది.

ఫైటర్‌ అన్న వర్కింగ్ టైటిల్‌తో పూరీ, విజయ్‌ సినిమా మొదలైంది. పూరీ సినిమాల టైటిల్స్‌లో వుంటే తిట్టు వుండాలి. లేదంటే.. ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం.. అమ్మ నాన్న తమిళ అమ్మాయి మాదిరి డిఫరెంట్‌గా వుండాలి. ఫైటర్‌లో ఇవేవీ లేవు. టైటిల్‌ ఇది కాదు.. త్వరలో ఎనౌన్స్‌ చేస్తామని ఛార్మి చెప్పడంతో.. టైటిల్‌ కోసం ఎగ్జయింట్‌మెంట్‌తో ఎదురుచూశారు ఫ్యాన్స్‌. ‘లైగర్‌’ అన్న పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెట్టాడు పూరీ.

లైగర్‌ టైటిల్‌తోపాటు.. ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. వెనకాల బ్యాక్‌డ్రాప్‌లో టైటిల్‌కు తగ్గట్టు సగంసింహం.. సగం పులి కనిపించాయి. హీరో బాక్సింగ్‌ స్టిల్లో వున్నాడు. మగ సింహం, ఆడ పులి సంతానాన్ని లైగర్‌ అంటారు. ఇది సింహం, పులి కన్నా చాలా పెద్దగా వుంటూ.. సింహంలానే గర్జిస్తుంది. ఇది అర్థం కావడానికి ‘సాలా క్రాస్‌బ్రీడ్‌’ అన్న ట్యాగ్‌లైన్‌ పెట్టాడు పూరీ.

అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌ కబీర్‌సింగ్‌ 300 కోట్లు కలెక్ట్‌ చేసింది. కబీర్‌సింగ్‌ ఒరిజినల్‌ వెర్షన్‌ హీరోగా విజయ్‌కు సౌత్‌లో గుర్తింపు వుంది. లైగర్‌తో విజయ్‌ పాన్‌ ఇండియాలోకి అడుగు పెడుతూ మార్కెట్‌ పెంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరీతోపాటు.. కరణ్‌ జోహార్‌.. అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌ కాగా.. లాక్‌డౌన్‌ తర్వాత లైగర్‌ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ నెలలోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news