తలనొప్పి నుండి బరువు తగ్గడం వరకు పుదీనా చేసే మేలు తెలుసుకోండి.

-

పుదీనా.. చక్కటి వాసన కలిగి ఉండి ఆహార పదార్థాలకి అదనపు అందాన్ని తేవడమే కాకుండా మనకి ఆరోగ్యాన్ని పంచిస్తుంది. అందుకే మన వంటకాల్లో పుదీనాకి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఉండే ఫాలీఫినాల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలూ తక్కువే. కానీ, విటమిన్ ఏ, విటమిన్ సి, బీ కాంప్లెక్స్ విటమిన్లు మాత్రం దండిగా ఉంటాయి. వీటివల్ల చర్మానికి ఆరోగ్యం అందించబడుతుంది. అంతే కాదు అధిక ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటి వాటివల్ల రక్తంలో హీమోగ్లోబిన్ పెరిగి, మెదడు పనితీరు మెరుగవుతుంది.

పుదీనా ఉపయోగాలు

జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైటోన్యూట్రియెంట్స్ అనే ఎంజైమ్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడుతుంది. ఇంకా, ఇందులో ఉండే ఆమ్లాలు విష పదార్థాలని బయటకు పంపివేయడమే కాకుండా అపానవాయువు రాకుండా ఉంచుతుంది.

ఆస్తమాని తగ్గిస్తుంది

క్రమం తప్పకుండా పుదీనాని తీసుకోవడం వల్ల ఆస్తమాని అదుపులో పెట్టవచ్చు. ఐతే ఇక్కడ మరీ ఎక్కువగా పుదీనాని తీసుకోకూడదు. దానివల్ల ముక్కులో చిరాకు ఏర్పడే అవకాశం ఉంది.

తలనొప్పిని తగ్గిస్తుంది

ఇందులో మెంథాల్, తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మీ నుదురుపై పుదీనా జ్యూస్ పెట్టుకుంటే తగ్గే అవకాశం ఎక్కువ.

ఒత్తిడిని తగ్గిస్తుంది

దీని సువాసన ద్వారా ఒత్తిడి దూరం అవుతుంది. అరోమా థెరపీలో పుదీనాని వాడతారు. మెదడులో కార్టిసాల్ స్థాయిని నియంత్రించి విశ్రాంత పరుస్తుంది.

బరువు తగ్గడం

పుదీనాలో ఉండే నూనెలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియని మెరుగు పర్చడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. జీవక్రియ పెరిగితే బరువు తగ్గుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version