వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలకైనా కూడా పరిష్కారం ఉంటుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రశాంతత లభించాలన్నా నెగిటివ్ ఎనర్జీ తొలగి పోవాలన్నా నెమలీక బాగా ఉపయోగపడుతుంది. వాస్తు దోషాలను కూడా తొలగించుకోవచ్చు.
సరైన విధంగా వాస్తు ప్రకారం ఫాలో అయితే ఆర్థిక బాధల నుండి కూడా బయటపడవచ్చు నెగటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతంగా ఉండొచ్చు. సూర్యుడు ఇంద్ర దేవుడు తూర్పు వైపు ఉంటారు అయితే వాస్తు ప్రకారం నెమలీకలని ఈ దిశ లో పెట్టడం వలన ఆర్థిక బాధల నుండి బయట పడచ్చని పండితులు అంటున్నారు. రాహు దోషం ఉన్నట్లయితే ఈశాన్య దిశలో నెమలీకని పెట్టండి అప్పుడు మీకు రాహు దోషం తొలగిపోతుంది.
విద్యార్థులకి నెమలీకలు బాగా హెల్ప్ అవుతాయి పుస్తకం మధ్య లో స్టడీ టేబుల్ మీద నెమలీకలని పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. తూర్పు వైపు నెమలీకలని పెడితే ఇంట్లో గొడవలు జరగవు. సమస్యలన్నిటినీ కూడా తొలగించుకోవచ్చు. భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలని పెరగాలంటే రెండు నెమలీకలని బెడ్రూంలో ఉంచండి. అప్పుడు భార్య భర్తల మధ్య ప్రేమను రాగాలు బలపడతాయి వారి మధ్య ఇబ్బందులు తొలగిపోతాయి.