లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో ఇండియా ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా, బదులుగా ఇండియా ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి ఇంకా 200 కు పైగా పరుగులు వెనుకబడి ఉంది. ఈ ఉదయం మూడవ రోజు ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఇండియాకు ఆరంభములోనే రెండవ బంతికే శ్రీకర్ భరత్ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రహానే ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఎదవ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఇక అజింక్య రహానే సైతం టెస్ట్ కెరీర్ లో 5000 పరుగులు మెయిలు రాయిని చేరుకున్నాడు. ఇండియా తరపున టెస్ట్ లలో ఆ ఘనతను సాధించిన 13వ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.