బీపీ నుండి జీర్ణ సమస్య వరకు ముల్లంగితో మాయం..!

-

ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగి వల్ల చాలా బెనిఫిట్స్ ని మనం పొందవచ్చు. ఎన్నో సమస్యలను ముల్లంగి తరిమికొట్టేస్తుంది. అయితే ముల్లంగి వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది చూసేద్దాం.

 

ముల్లంగిలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి ఉంటాయి. దీని వల్ల ఎన్నో పోషక పదార్థాలు మనకి లభిస్తాయి.

జీర్ణ సమస్యలను పోగొడుతుంది:

ముల్లంగి లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అర కప్పు ముల్లంగి లో ఒక గ్రాము ఫైబర్ ఉంటుంది. అలానే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇలా ముల్లంగితో జీర్ణసమస్యలు మనం తగ్గించుకోవచ్చు.

హైడ్రేట్ గా ఉండొచ్చు:

ముల్లంగిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది. ముల్లంగి తిన్న తర్వాత బెల్లం తింటే బాగా జీర్ణం అవుతుంది. అదే విధంగా నోటి నుండి దుర్వాసన కూడా పోతుంది.

చర్మానికి మంచిది:

ముల్లంగిలో విటమిన్స్, ఫాస్ఫరస్, జింక్ ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల యాక్నీ, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు కూడా పోతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

ముల్లంగి లో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం మరియు ఇతర మినిరల్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి బాగా ఉపయోగపడతాయి.

బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు:

ముల్లంగిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. అదే విధంగా బ్లడ్ ఫ్లో ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా ముల్లంగి వల్ల ఇన్ని బెనిఫిట్స్ మనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news