జగన్‌ ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌… వారిది నయవంచనే !

జగన్‌ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌ అయ్యారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యపై స్పందించిన పవన్… రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు సృష్టించారని మండిపడ్డారు. ఆ చొరవ, ఆసక్తి నిరుద్యోగులపై లేదని…30 లక్షల మంది నిరుద్యోగుల బాధ కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

151 మంది ఎమ్మెల్యే లతో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 30 లక్షల మంది సపోర్టు కారణమన్నారు పవన్‌ కళ్యాణ్‌. 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 10 వేల జాబ్స్ జాబ్ క్యాలెండర్ లో పెట్టారని.. ఇది నిరుద్యోగులను నయవంచన చేయటమేనని ఫైర్‌ అయ్యారు పవన్‌ కళ్యాణ్‌. పోలీస్ శాఖలో వేల పోస్టులు ఉంటే జాబ్ క్యాలెండర్ లో వందల పోస్టులు పెట్టారని… అసలు ఇంత వరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఊసే లేదని మండి పడ్డారు. నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్న పవన్‌ కళ్యాణ్‌… రేపు అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని స్పష్టం చేశారు.