టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ వీటి వలన ఉంటుంది. పైగా పదవీ విరమణ తర్వాత ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు కూడా ఇది ఉపయోగం. టర్మ్ ప్లాన్స్ అత్యుత్తమ ఇన్సురెన్స్ ప్లాన్స్. టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలు చౌకైవే కాకుండా అధిక మొత్తం క్లెయిమ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది.
ఒకవేళ దురదృష్టకరమైనవి ఏమైనా జరిగితే ఆధారపడిన వారికి లేదా కుటుంబ సభ్యుల ఆర్థిక సంక్షోభాలను నివారించడానికి ఈ జీవిత భీమా పాలసీని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ జీవిత బీమా పథకాలను ఎంచుకున్న పాలసీదారు మరణిస్తే నెల వారీ వాయిదాల్లో కానీ మొత్తంగా ఒకేసారి ఇలా రెండు రకాల ఆప్షన్ల ద్వారా డబ్బు తిరిగి పొందే వీలుంటుంది.
యాభై ఎల్లా వయస్సు వున్నా వారు ఈ పాలసీని తీసుకోవచ్చా అనే విషయానికి వస్తే… టర్మ్ ఇన్సురెన్స్ కొనుగోలు చేయాలనుకునే వారు రిటైర్మెంట్ వయస్సు లోపు కవర్ అయ్యేలా చూడాలి. ఒక వేళ టర్మ్ ప్లాన్ ఆలస్యం అయితే కనుక 50 ఏళ్ల వయస్సు వున్న వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చా లేదా అనే దాని కోసం చూస్తే… వీళ్ళకి కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు పని చేసే అవకాశముంది. కనుక ఈ టర్మ్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. దీని వలన మీ కుటుంబానికే కాకుండా మీ పదవీ విరమణ తర్వాత ఆదాయంగా మారుతుంది. కాబట్టి తీసుకోవడమే మంచిది.
కుటుంబం లో విషాదం జరిగితే నామినీ పేరు మీద మిగిలిన మొత్తం చెల్లించబడుతుంది. ఆదాయానికి అవసరమైన పాలసీ హోల్డింగును ఒకే ప్లాన్ లో ఉండేలా చేస్తుంది. ఈ ప్లాన్స్ ద్వారా 100 ఏళ్ల వరకు పాలసీదారుడికి కవరేజిని అందిస్తాయి. భవిష్యత్తు తరాల కోసం తగినంత మొత్తాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.