ఐదు రాష్ట్రాల ఎన్నికల పై ఆసక్తిరేపుతున్న సర్వే ఫలితాలు

Join Our Community
follow manalokam on social media

నాలుగు రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో సర్వేలు ఏం చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో దీదీ హ్యాట్రిక్‌ కొడతారా..బీజేపీ పాగా వేస్తుందా..తమిళనాడులో డీఎంకే కి ఎదురులేదా..కేరళలో గెలుపెవరిది నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల పై సీ ఓటర్‌ సర్వే ఆసక్తిరేపుతుంది.


బెంగాల్ లో బీజేపీకి షాక్‌ తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయ్‌. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి విజయం సాధిస్తుందని ప్రీ పోల్‌ సర్వేల్లో తేలింది. మమత పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు గెలవదని స్పష్టం చేసింది. 294 స్థానాలున్న బెంగాల్‌ అసెంబ్లీలో…టీఎంసీ 152-162 సీట్లు, బీజేపీ 104-120 స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపింది. గత ఎన్నికల్లో 3 సీట్లకు పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించనుంది.

తమిళనాడులో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకేకు ఈ ఎన్నికల్లో షాక్‌ తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయ్‌. అరవనాట సత్తా చాటాలని కమల పార్టీకి…ఈ ఎన్నికల్లో షాక్‌ తప్పదని తేలింది. 234 సీట్లున్న తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి..173-181 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటు అన్నాడీఎంకే, బీజేపీ కూటమి 45-53స్థానాలను గెలుచుకోనుంది.

కేరళలో సీపీఎం పార్టీ చరిత్ర సృష్టించనుంది. ఆ రాష్ట్రంలో 40 ఏళ్లకు పైగా ఏ పార్టీ కూడా రెండు సార్లు విజయం సాధించలేదు. ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నారు సీఎం పినరయ్ విజయన్‌. 140 అసెంబ్లీ సీట్లలోఎల్‌డీఎఫ్‌కు 77, యుడీఎఫ్‌కు 62 సీట్లు వస్తాయని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయ్.

126 స్థానాలున్న అసోంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వేలు తేల్చాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని అయితే ప్రభుత్వాన్ని మాత్రం కమలదళం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. బీజేపీ కూటమికి 65-73, కాంగ్రెస్‌ కూటమికి 52-60 సీట్లుల దక్కే ఛాన్స్‌ ఉంది. 30 సీట్లున్న పుదుచ్చేరిలో ఎన్‌డీఏ 19-23, కాంగ్రెస్‌, డీఎంకే కూటమి 7-11 స్థానాలు గెలిచే ఛాన్స్‌ ఉంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...