వెహికిల్ స్క్రాపేజ్‌ పాలసీ వలన కలిగే లాభాలివే..!

-

కాలుష్య కారక వాహనాలను తొలగించడానికి వెహికిల్ స్క్రాపేజ్‌ పాలసీ ( Vehicle Scrappage Policy ) సహాయపడుతుంది. దశలవారీగా పాత, అన్ ఫిట్ వాహనాలను తొలగించడమే దీని యొక్క లక్ష్యం. వాహనాల రిజిస్ట్రేషన్ పరిమితికాలం పూర్తి అయ్యాక స్క్రాపేజ్‌ పాలసీ అమలులోకి రావడం జరుగుతుంది.

 

Vehicle Scrappage Policy | వెహికిల్ స్క్రాపేజ్‌ పాలసీ
Vehicle Scrappage Policy | వెహికిల్ స్క్రాపేజ్‌ పాలసీ

ఇది ఇలా ఉంటే మోటార్ వాహన చట్టాల ప్రకారం వ్యక్తిగత వాహనాల జీవితకాలం 15, వాణిజ్య వాహనాల జీవితకాలం 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇలాంటివి ఉండడం వలన ఇబ్బందులు వస్తాయి. ఇటువంటి వాహనాలను క్రమపద్ధతిలో రీసైక్లింగ్ చేయడానికి, వినియోగించే వ్యక్తులకు ప్రోత్సాహకాలను అందించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

దశలవారీగా రీసైకిల్ చేయడమే స్క్రాపేజ్ పాలసీ లక్ష్యం. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని పాత వాహనాల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే పాలసీ ప్రధాన లక్ష్యం. పాత వాహనాలను రద్దు చేయడం వల్ల గాలి కాలుష్యాన్ని తగ్గించడం మొదలు ఎన్నో లాభాలు వున్నాయి. ఇక ఏది స్క్రాప్ అనేది చూస్తే.. 15 సంవత్సరాలు దాటిన అన్ని వ్యక్తిగత వాహనాలను తుక్కుగా మార్చరు.

అలాగే 10 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను కూడా స్క్రాప్ గా పరిగణించరు. ఇది ఇలా ఉంటే ఫిట్‌నెస్ టెస్టు సెంటర్లలో వాహనాల బ్రేకింగ్, ఇంజిన్ పర్ఫామెన్స్ చెక్ చేస్తారు. మిగతా అన్ని టెస్టులు నిర్వహించి పొల్యూషన్ స్థాయి ఏ లెవెల్ ఉందో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్క్రాపింగ్‌కు ఇవ్వాలనుకుంటే వెహికల్ ఎక్స్ షోరూం ధర ప్రకారం 4 నుంచి 6 శాతం ప్రోత్సాహకాలు అందుతాయి. అలానే రోడ్డు పన్ను నుంచి 25 శాతం, వాణిజ్య వాహనాల కొనుగోలు నుంచి 15 శాతం రాయితీ లభిస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news