సినిమాలు మానేస్తున్నాడంటూ మంచు మనోజ్ పై కథనం.. కట్ చెప్పొద్దన్న యాక్టర్.

-

సినిమా హీరో మంచు మనోజ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. సమాజంలోని పరిస్థితులకు స్పందిస్తూ ఉంటాడు. కరోనా టైమ్ లో మంచు మనోజ్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, చేపట్టిన చర్యలు అందరికీ తెలుసు. సమాజంలో జరిగే సంఘటనలకు ఎంత ఘాటుగా జవాబిస్తాడో తనపై వచ్చే పుకార్లకు అంతే గట్టిగా స్పందిస్తాడు మనోజ్. ఈ మధ్య కాలంలో మనోజ్ సినిమాలు మానేస్తున్నాడంటూ ఓ వార్త హల్చల్ చేసింది. సోషల్ మీడియాలో విరివిగా వెళ్ళిపోయిన ఈ వార్తపై మనోజ్ గట్టిగా స్పందించాడు.

తెలిసీ తెలియని తనంతో తప్పుడు ప్రచారాలు చేయవద్దని, మన సినిమా సమ్మర్ లో మొదలవుతుందని, ఒక్కసారి యాక్షన్ చెబితే కట్ చెప్పేది లేదని, మొదలవ్వక ముందే కట్ చెప్పొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తపరిచాడు. మంచు మనోజ్ హీరోగా అహం బ్రహ్మస్మి పేరుతో పాన్ ఇండియా రేంజిలో సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మంచు మనోజ్ ఎంతగానో శ్రమించినట్లు, కొన్ని కొన్ని ఫైట్లలో విపరీతమైన గాయాలైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news