విటమిన్ బీ12 లోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

-

విటమిన్ బీ12 | Vitamin B12 . కోబాలమిన్ గా పిలవబడే ఈ విటమిన్ నీటిలో కరుగుతుంది. ఇందులో కోబాల్ట్ ప్రధాన మూలకంగా ఉంటుంది. రక్తం ఏర్పడడానికి, అలాగే నాడీ వ్యవస్థ పనిచేయడానికి ఈ విటమిన్ అవసరం ఉంటుంది. ఐతే ఈ విటమిన్ మన శరీరంలో ఉత్పత్తి అవ్వదు. అందుకని మనం తీసుకునే ఆహారాల్లో ఈ విటమిన్ ఉండేలా చూసుకోవాలి. శాఖహారం తినేవారిలో ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. దీని లోపం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అందులో చిత్తవైకల్యం ఒకటి. ఆలోచన తగ్గిపోవడం దీని లక్షణం.

 

విటమిన్ బీ12 | Vitamin B12
విటమిన్ బీ12 | Vitamin B12

బీ12 విటమిన్ లోపం వల్ల కలిగే అనర్థాలు..

బీ12 వల్ల రక్త కణాలు తయారవుతాయి. ఈ రక్త కణాలు శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. బీ12విటమిన్ లోపం వల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. అప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు. దీనివల్ల ఆలోచనల్లో కన్ఫ్యూజన్ మొదలవుతుంది.

ఒత్తిడి

బీ12 తక్కువగా ఉండడం వల్ల మెదడు సిగ్నల్స్ సరిగా పనిచేయవు. అప్పుడు మూడ్ స్వింగ్స్ కలుగుతుంది. ఈ లోపాన్ని తగ్గించుకోవడానికి బీ12 విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది.

దృష్టి నిలవలేకపోవడం

మీ దృష్టి ఒక ఆలోచనపై లేదని మీరు గమనిస్తున్నట్టయితే బీ12 లోపం ఉందని గుర్తించాలి. పోషకాహార లోపం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అందుకే ఆహారంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటున్నారో చెక్ చేసుకోండి.

మతిమరుపు

ఏదైనా వస్తువును ఒక దగ్గర పెట్టి మర్చిపోవడం, మాటి మాటికీ వెతుక్కోవడం జరుగుతుంటే బీ12 లోపం అని గమనించండి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

బీ12 లోపానికి కారణాలు

దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి.
1. హానికర రక్తహీనత
2. డైట్

హానికర రక్తహీనత కారణంగా శరీరంలో విటమిన్ లోపం కనిపిస్తుంది. శరీరంలో రక్తం తగ్గిపోతున్నప్పుడు దానికి కారణాలు వెంటనే కనుక్కోవడం మంచిది. ఇంకా మీరు తీసుకునే ఆహారంలో బీ12 సరైన పాళ్ళలో ఉందా లేదా గమనించుకోవాలి. ముఖ్యంగా శాఖాహారులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఒకరోజులో మన శరీరానికి విటమిన్ బీ12 ఎంత అవసరం ఉంటుంది?

4-8సంవత్సరాల చిన్నపిల్లలకు- 1.2 mcg
9-13సంవత్సరాల పిల్లలకు – 1.8 mcg
14-18సంవత్సరాల టీనేజర్లకు, పెద్దలకు- 2.4 mcg
గర్భ దాల్చిన మహిళలకు – : 2.6 mcg
పాలిచ్చే తల్లులు- 2.8mcg తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news