చాలా మంది వాళ్ళ డబ్బులని ఏదో ఒక దానిలో ఇన్వెస్ట్ చేసి డబ్బులని పొందాలని భావిస్తూ వుంటారు..? ఇలా స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన దాని కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. పైగా ఇతర లాభాలని కూడా పొందొచ్చు. అయితే మీరు చేతిలోని డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే పోస్టాఫీస్ కూడా ఒకటి.
పోస్టాఫీస్ లో పలు రకాల పథకాలు కూడా వున్నాయి. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు కనుక ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రూ.100తో కూడా మీరు రికరింగ్ డిపాజిట్ ఖాతాను స్టార్ట్ చెయ్యచ్చు.
దీనిలో మీకు నచ్చినంత ఇన్వెస్ట్ చెయ్యచ్చు. అయితే ప్రతీ నెలా డబ్బులు కట్టాలి. పైగా ఎలాంటి రిస్క్ ఇందులో ఉండదు. మంచిగా రాబడి వస్తుంది. ఈ స్కీమ్ గడువు ఐదేళ్లు. దీన్ని మరో ఐదేళ్లు కావాలంటే ఎక్స్టెండ్ చెయ్యచ్చు. ప్రస్తుతం ఈ పథకం పై 5.8 శాతం వడ్డీ వస్తుంది.
వడ్డీ రేట్లు అనేవి ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. కేంద్ర ప్రభుత్వం వీటిని మార్చుతుంది. మీరు నెలకు రూ.10 వేలు పొదుపు చేసి పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్లో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయం లో చేతికి రూ.16.28 లక్షలు వస్తాయి. పదేళ్ల పాటు డబ్బులు పెట్టాలి. లేదంటే చార్జెస్ పే చెయ్యాల్సి ఉంటుంది.