కృష్ణా జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డ్

కృష్ణాజిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. కృష్ణాజిల్లా కు బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ అవార్డు ప్రకటించింది కేంద్రం. ఈ సంధర్భంగా జిల్లా‌ కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణాజిల్లా కు బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ అవార్డు రావడం గర్వకారణం కారణం అని ఆయన అన్నారు. 3 లక్షల నగదు బహుమతి కూడా‌ అందచేజేయనున్నారు అని ఆయన అన్నారు.

కరోనా సమయంలో ఆక్వా రైతులకు  అందించిన సహకారంతో ఈ అవార్డుకు ఎంపిక అయ్యామని ఆయన అన్నారు. కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది అని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో ఆక్వా రైతులకు ప్రోడక్ట్ ను సరఫరా చేసుకునేందుకు  4 వేల పాస్ లు అందచేశామని ఆయన అన్నారు. లక్షా‌ 50 వేల ఎకరాల సమాచారాన్ని ఈ క్రాప్ లో పెట్టామన్న ఆయన కేంద్ర ఫిషరీస్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు ప్రధానం ఎల్లుండి ఢిల్లీలో జరగనుందని అన్నారు.