ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా కంపెనీలు అత్యుత్తమ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. కరోనా వల్ల 3 నెలల పాటు ఎలాంటి అమ్మకాలు లేకపోయినా తరువాత నెమ్మదిగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ పుంజుకుంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ అనంతరం కంపెనీలు అధిక సంఖ్యలో ఫోన్లను విడుదల చేశాయి. అయితే ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో మాత్రం పలు స్మార్ట్ ఫోన్లు ఈ ఏడాది కాలంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోకో ఎక్స్3 – ఈ ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో పోకో ఎక్స్3 మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో 6.67 ఇంచుల 120 హెడ్జ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 732జి ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 64 మెగాపిక్సల్ బ్యాక్ మెయిన్ కెమెరా ప్రధాన ఆకర్షణలు. రూ.15,999 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభిస్తోంది.
రియల్‌మి6 – ఇందులో పలు భిన్న మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జి90టి ప్రాసెసర్, 64 మెగాపిక్సల్ కెమెరా, ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ప్రధాన ఫీచర్లు. ధర రూ.12,999 నుంచి ప్రారంభం.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 – ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ధర రూ.15,499 నుంచి ప్రారంభం.
ఒప్పో ఎఫ్15 – ఇందులో మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 30వాట్ల ఫ్లాష్ చార్జింగ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లను ఇచ్చారు. ధర రూ.14,990 నుంచి ప్రారంభం అవుతుంది.
రియల్‌మి సి15 – ఇందులో క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉన్న వేరియెంట్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంట్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. ధర రూ.8,999.
మోటోరోలా వన్ ఫ్ల్యుషన్ ప్లస్ – ఇందులో స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్, 16 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా, 64 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.16,999 నుంచి ప్రారంభం అవుతుంది.
ఒప్పో రెనో 3 ప్రొ – మీడియాటెక్ హీలియో పి95 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.24,990.
ఐఫోన్ ఎక్స్ఆర్ – ఐఫోన్ ఎక్స్ఆర్ పాత మోడల్ అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏడాది ఈ ఫోన్ ఎక్కువగా అమ్మడైంది. ఇందులో యాపిల్ ఐఓఎస్ 12ను అందిస్తున్నారు. 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ధర రూ.38,999 నుంచి ప్రారంభం అవుతుంది.