టిక్‌టాక్‌ మళ్లీ వచ్చింది.. తస్మాత్‌ జాగ్రత్త

-

చైనాకు చెందిన యాప్స్‌ను నిషేదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే. వీటిలో టిక్‌టాక్‌ కూడా ఉంది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ అయిన బైట్‌ డాన్స్‌ దాదాపు 6 పై బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు ‘‘గ్లోబల్ టైమ్స్’’ నివేదిక తెలిపింది.. ఇప్పటివరకు టిక్‌టాక్‌తో ఫేమస్‌ అయినవారు, దానికి అలవాటు పడినవారు టిక్‌టాక్‌ని కలవరిస్తున్నారు.

అయితే ఇప్పుడు మళ్లీ టిక్‌టాక్‌ ప్రో అంటూ సోషల్‌ మీడియాలో ఓ మెసెజ్‌ హల్‌ చల్‌ చేస్తుంది. టిక్‌టాక్‌ ప్రేమికులు యెడాపెడా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఈ నకిలీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం కొంపముంచుతుంది. ఈ యాప్‌ ద్వారా మాల్వేర్‌ మీ ఫోన్‌లోకి వచ్చేస్తుందని, దాంతో ఫోన్‌ హ్యకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి టిక్‌టాక్‌ యాప్‌ 75MB సైజ్ , టిక్‌టాక్‌ ప్రో యాప్‌ 90 MB వరకు ఉంటుందని, ఈ యాప్‌ ఇన్స్టాల్‌ చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

tiktok pro app – image credits to Sridhar Nallamothu

Read more RELATED
Recommended to you

Latest news