పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తున్న ఈ 25 యాప్స్‌ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే తీసేయండి..!

-

సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ తన ప్లేస్టోర్‌ యాప్‌లో ఉన్న అనుమానాస్పద యాప్‌లను ఎప్పటికప్పుడు తొలగిస్తూనే వస్తోంది. యూజర్ల డేటాను తస్కరించే యాప్స్‌ను గూగుల్‌.. ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తోంది. అయినప్పటికీ అనేక యాప్‌లు ఇంకా ప్లేస్టోర్‌లో ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ఇక తాజాగా మరో 25 యాప్‌లను కూడా గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఈ యాప్‌లు యూజర్ల ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలను చోరీ చేస్తున్నాయని వెల్లడైంది. దీంతో వాటిని ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్లు గూగుల్‌ తెలిపింది.

if you have these 25 apps in your smart phone remove immediately

సదరు 25 యాప్‌లలో యూజర్లు ఫేస్‌బుక్‌ ఉపయోగించి వాటిలోకి లాగిన్ అయినప్పుడు ఆ యాప్స్‌ యూజర్లకు చెందిన ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలను రికార్డ్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవినా అనే సైబర్‌సెక్యూరిటీ సంస్థ కనిపెట్టి గూగుల్‌కు తెలిపింది. దీంతో గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి ఆ 25 యాప్‌లను తొలగించింది. ఇక యూజర్లను కూడా ఈ యాప్‌లను వెంటనే తమ ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి తీసేయాలని గూగుల్‌ సూచించింది. ఈ యాప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

– సూపర్‌ వాల్‌పేపర్స్‌ ఫ్లాష్‌లైట్‌
– Padenatef
– వాల్‌పేపర్‌ లెవల్‌
– కాంటర్‌ లెవల్‌ వాల్‌పేపర్‌
– ఐ ప్లేయర్‌ అండ్‌ ఐవాల్‌పేపర్‌
– వీడియో మేకర్‌
– కలర్‌ వాల్‌పేపర్స్‌
– పెడోమీటర్‌
– పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌లైట్‌
– సూపర్‌ బ్రైట్‌ ఫ్లాష్‌లైట్‌
– సూపర్‌ ఫ్లాష్‌లైట్‌
– సాలిటేర్‌ గేమ్‌
– యాక్యురేట్‌ స్కానింగ్‌ ఆఫ్‌ క్యూఆర్‌ కోడ్‌
– క్లాసిక్‌ కార్డ్‌ గేమ్‌
– జంక్‌ ఫైల్‌ క్లీనింగ్‌
– సింథటిక్‌ జడ్‌
– ఫైల్‌ మేనేజర్‌
– కంపోజిట్‌ జడ్‌
– స్క్రీన్‌షాప్‌ క్యాప్చర్‌
– డెయిలీ హోరోస్కోప్‌ వాల్‌పేపర్స్‌
– వుక్సియా రీడర్‌
– ప్లస్‌ వెదర్‌
– యానిమ్‌ లైవ్‌ వాల్‌పేపర్‌
– ఐహెల్త్‌ స్టెప్‌ కౌంటర్‌
– కామ్‌.టైయాప్‌.ఫిక్షన్‌

పైన తెలిపిన యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి. అలాగే మీ ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చుకోండి. పైన తెలిపిన యాప్‌లలో చాలా వరకు యాప్స్‌ను ఇప్పటికే కొన్ని లక్షల మందికి పైగా యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కనుక ఈ యాప్స్‌ మీ ఫోన్లలో ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాటిని తొలగించండి.

Read more RELATED
Recommended to you

Latest news