నేడు భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

-

రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు రామాలయాలకు బారులు తీరుతున్నారు. రాష్ట్రంలోని రాముల వారి ఆలయాల్లో ఇవాళ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు భద్రాచలంలో సీతారాముల కల్యాణం అట్టహాసంగా జరగనుంది. జగదేక వీరుడు రాముడికి.. అతిలోక సుందరి సీతమ్మకు జరిగే… కమనీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

సీతారాముల కల్యాణం అభిజిత్ లగ్నంలో జరగనుంది. తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు. కల్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేశాక….రక్షా బంధనం నిర్వహించి యోక్ర్తధారణ చేస్తారు. దర్బాలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారి నడుముకి బిగిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కడతారు.

వేద మంత్రోచ్చరణాలు మార్మోగుతుండగా..అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. అనంతరం సీతమ్మ మెడలో మంగళసూత్ర ధారణ జరుగుతుంది. రామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news