మధ్యప్రదేశ్ లో ఒక విషాద సంఘటన జరిగింది. 12 ఏళ్ళ బాలుడు ఒకరు భగత్ సింగ్ లా ఉరి ట్రై చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్‌సౌర్‌లోని అఫ్జల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే భోలియా గ్రామంలో చోటు చేసుకుంది. పిల్లాడు భగత్ సింగ్ జీవితం చుట్టూ తిరిగే నాటకం యొక్క వీడియోను మొబైల్ ఫోన్లో చూస్తున్నాడు, ఒకరకంగా చెప్పాలి అంటే అందులో లీనం అయిపోయాడు.
ఇక ఈ సమయంలో భగత్ సింగ్ ని ఉరి వేసే సీన్ వస్తుంది. దానిని చూసి ఆ బాలుడు అలాగే ట్రై చేసాడు. మెడకు నిజంగానే ఉరి బిగుసుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతడిని గ్రామానికి చెందిన 12 ఏళ్ళ శ్రేయాన్ష్ గా పోలీసులు గుర్తించారు. మాండ్సౌర్ ఎస్పీ హితేష్ చౌదరి మాట్లాడుతూ, “12 ఏళ్ల పిల్లాడు పాఠశాలలో భగత్ సింగ్ పై నాటకం యొక్క వీడియో క్లిప్ చూస్తున్నాడు.
ఈ సమయంలో, భగత్ సింగ్ ను ఉరితీసిన దృశ్యాన్ని అనుకరించటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పట్టు కోల్పోవడంతో ఉరి బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. పాఠశాల నాటకంలో పిల్లాడు అధికారి పాత్రను పోషించాడని ఆయన అన్నారు. పోస్ట్ మార్టం నివేదిక కూడా ఉరి కారణంగానే మరణించాడని నిర్ధారించింది. ఈ విషాద సంఘటన తరువాత, పోలీసులు…
జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. “పిల్లలు మొబైల్‌లో చూసే వాటిని అనుకరించడానికి తరచుగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎం చేస్తారో, గమనిస్తూ ఉండాలని సూచించారు. లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని తల్లి తండ్రులకు సూచించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.