ప్రపంచ దేశాలు మోడీ వైపు చూస్తున్నాయి: ఎంపీ అభ్యర్థి భారత్

-

ప్రపంచ దేశాలు అన్నీ కూడా మోడీ వైపు చూస్తున్నాయని మోడీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశ ఆర్థిక పురోగతి మీద పరుగులు పెట్టిస్తున్నారని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భారత్ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కూడా మోడీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తలకొండపల్లి మండలంలోని బిజెపి మండల అధ్యక్షుడు తిరుమణి రవి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లకి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

తెలంగాణని పదేళ్ల పాటు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని 50 ఏళ్ల పాటు మన రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులు ఇంకోసారి మోసపూరిత వాగ్దానాలు చూసి అధికారం లోకి రావడానికి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారని ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news