దేశంలో ఆయా రంగాల్లో గొప్పగా సేవలందించిన ప్రముఖులకు భారతరత్నను ప్రదానం చేస్తూ వస్తున్నారు. కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడా రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
ఎందరో మహానుభావులు.. మన దేశానికి ఎంతో మంది ఎన్నో రంగాల్లో సేవలందించారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించినప్పుడు వీలు పడలేదేమో కానీ.. స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి ఆయా రంగాల్లో సేవలందించిన ప్రముఖులను మనం గౌరవిస్తూనే ఉన్నాం. ఆ మహానుభావులను మనం సత్కరించుకుంటూనే ఉన్నాం. ఈ క్రమంలోనే దేశానికి గొప్పగా సేవలందించిన ప్రముఖులకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందిస్తున్నాం. ఆ పురస్కారం పొందడమంటే మామూలు విషయం కాదు. దేశానికి ఎంతో సేవ చేస్తేనే కానీ ఆ అవార్డు లభించదు.
దేశంలో ఆయా రంగాల్లో గొప్పగా సేవలందించిన ప్రముఖులకు భారతరత్నను ప్రదానం చేస్తూ వస్తున్నారు. కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడా రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. మొట్ట మొదటి సారిగా 1954 జనవరి 2వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతరత్నను తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి భారతరత్నను అందిస్తున్నారు. కాగా 1977 జూలై 13 నుంచి 1980 జనవరి 26 వరకు ఈ పురస్కారాన్ని ఇవ్వడం ఆపేశారు. కానీ ఆ తరువాత మళ్లీ భారతరత్నను ప్రదానం చేయడం మొదలు పెట్టారు.
దేశంలో ఉన్న ఏ జాతికి చెందిన, ఏ మతం, కులానికి చెందిన వారికైనా సరే.. స్త్రీ, పురుషుడు అన్న వ్యత్యాసం లేకుండా భారతరత్నను ప్రదానం చేస్తారు. ఇక ఈ పురస్కారాన్ని అందుకునే వారి జాబితాను ప్రధాన మంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. రాష్ట్రపతి ఆమోదం పొందాక భారతరత్నను ఇస్తారు. అయితే ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని సాధారణంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలోనే భారత రత్నను ప్రదానం చేస్తారు. ఇదీ.. భారత రత్న ఆవిర్భావం వెనుక ఉన్న అసలు కథ..!