కరోనా వైరస్ కనికరం లేకుండా కాటు వేస్తుంది, దీన్ని కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అరికట్టడం దాదాపుగా అసాధ్యమవుతుంది. కానీ దీన్ని ఎలాగైనా అధిగమించాలని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా కృషి చేస్తున్నారు, అలా ఒక దేశం లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల శాస్త్రవేత్తలు ఈ మహమ్మారి ని అరికట్టేందుకు వ్యాక్సిన్ తయారీ లో నిమగ్నమయ్యున్నారు. కానీ ఈ రేసులో భారత్ కొంత ముందంజ లో ఉంది. ఈపాటికే మేము అరికట్టగలము అని సిప్లా హెటిరో సంస్థలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే, కాగా ఇప్పుడు భారత్ బయోటిక్ సంస్థ అద్భుతమైన ఫలితాలు చూపుతూ ఈ రేస్ ను అధిగమిస్తుంది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో అద్భుతమైన పురోగతి కనబరుస్తోంది. భారత్ బయోటెక్ ‘కో వ్యాక్సిన్’ పేరిట తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇప్పటికే పలు దశలను విజయవంతంగా అధిగమించింది. జులై లో మనుషుల పై ప్రయోగాలు చేసేందుకు కూడా ఈ కంపెనీకి అనుమతులు వచ్చాయి. ఆ ట్రయల్స్ లో మెరుగైనా రిజల్ట్ చూపితే ఇక భారత్ కు తిరుగే లేదని చెప్పేయొచ్చు. అన్నీ సవ్యంగా సాగితే ఈ సంవత్సరం చివరిలో ఈ వ్యాక్సిన్ మార్కెట్ లలో లభ్యామవుతుంది.
త్వరలో కరోనా కు చెక్..! వ్యాక్సిన్ రేసు లో భారత్ బయోటెక్..!
-