టీడీపీ చేతకానితనమా చిత్తశుద్ధిలోపమా… ఆ భారం కూడా కేసీఆర్ పైనే?

-

తెలంగాణలో టీడీపీ ఉందా..? ఏమో బాబుగారినే అడగండి! అదేంటి, రమణ ఉన్నాడుగా..? ఇంకా చాలామందే ఉన్నారు కూడా! మరి ఇంకా తెలంగాణలో టీడీపీ ఉందా అనే డౌట్ ఎందుకు..? తెలంగాణ అవతరన దినోత్సవం రోజు కేకులు కోసుకున్నారు కదా? అంతోటిదానికే పార్టీ ఉందంటారా? ఓహో… ఆరోజు అధినేత కూడా కనీసం స్పందించలేదనా? ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడు కాదనేమో!!.. తెలంగాణలో టీడీపీ ఉందా అంటే ఉంది.. లేదా అంటే లేదు! కనీసం పార్టీ పేరున తమ ప్రాంత నేతకు సంబందించిన డిమాండ్ ను కూడా చెప్పలేని దీనస్థితిలో తెలంగాణ టీడీపీ నేతలు ఉన్నారా అనే అనుమానం కలగక మానదు!

వివరాళ్లోకి వెళ్తే… పీవీ నరసింహారావు కి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.. ఈ విషయంపై తానే నేరుగా ఢిల్లీకి వెళ్లి మాట్లాడతానని, ఆ విషయంలో పీవీ కుటుంబ సభ్యులను కూడా కలుపుకుపోతానని తెలిపారు. ఆ విషయంలో ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయం కాలమే చెబుతుంది. ఈ క్రమంలో… తెలంగాణ టీడీపీ నేతలు ఈ విషయంపై కెసీఆర్ నిర్ణయాన్ని అభినందించడమో… లేక తామెప్పుడో డిమాడ్ చేశామని పలకడమో… తాము కూడా కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పడమో చెయలేదు. మాకేంటి సంబందం అనుకున్నారా లేక.. మాకు పార్టీలో అంత హక్కు, స్వాంత్రతం ఎక్కడిది.. మహనాడు రోజున తప్ప మరోమారు మేము బాబుకు గుర్తుకురాముగా అని ఫీలయ్యారో తెలియదు కానీ… స్పందించలేదు!

కానీ… ఈ విషయంపై ఏపీ నుంచి టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. పీవీ నర్ససింహారావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ఎలాగూ తెప్పిస్తారు కాబట్టి.. అందులో కూడా మా డిమాండ్ వాటా ఉందని చెప్పడంలో భాగమో ఏమో కానీ… పీవీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఏపీ టీడీపీ. అంతేకాదు.. వారి రాజకీయ అస్త్రం “ఎన్టీఆర్ కు భారతరత్న” టాపిక్ ఎత్తిన టీడీపీ నేతలు… పీవీతో పాటు ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాడ్ చేసి ఊరుకోలేదు.. ఢిల్లీ వెళ్లి మాట్లాడి సాధించే పని తనదని చెప్పారు. మరి ఎన్టీఆర్ విషయంలో టీడీపీ చేసిందేమిటి? సరికదా… పీవీతోపాటు ఎన్టీఆర్ కు కూడా ఇవ్వాలని అనడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఎన్టీఆర్ కు కూడా పీవీతో పాటే భారతరత్న పై సిఫార్సు చేయమని కేసీఆర్ ని పరోక్షంగా కోరుతున్నారా? లేక తమ చేతకానితనాన్ని స్పష్టం చేయదలచుకున్నారా? ఏమో… అని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news