కరోనా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల పై భారీగా పడింది. పేదా ధనిక అనే తేడా లేకుండా హద్దు అదుపు లేకుండా స్వైర విహారం చేస్తుంది. ఎన్నో కఠిన చర్యలు తీసుకునే రాజకీయ నాయకులను కూడా ఈ మహమ్మారి ఉపేక్షించడం లేదు. వరుసగా 24 గంటల వ్యవదిలో తెలంగాణ లోని ఇద్దరు రాజకీయ నాయకులను ఈ మహమ్మారి ఎఫెక్ట్ చేసింది. నిన్న ఉదయం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కి కరోన పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే, ఇక నిన్న రాత్రికల్లా మరో నేత తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టీ పద్మా రావు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఇక ఇప్పుడు ఇదే క్రమంలో మరో పేరు వినిపిస్తుంది అదే ఎంఐఎం పార్టీ అధినేత హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గత రాత్రి నుండి సామాజిక మాధ్యమాల్లో హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కు కరోనా పాజిటివ్ అని తేలిందని తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిందనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు అయితే ఈ వార్త పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ వదంతు మాత్రం పుట్టింది. ఈ వార్త నిజమేనా అంటే ఎలాంటి ఆధారం లేదు, ఈ వార్త పై క్లారిటీ రావాలంటే స్వయానా ఎంపీ నోరు తెరవాల్సిందే..!
అసదుద్దీన్ ఓవైసీ కి కరోనా పాజిటివ్..? కుటుంబ సభ్యులకు కూడా..?
-