టోక్యోలో జరుగుతున్న పాలింపిక్స్ లో భారత్ కొత్త రికార్డు సృష్టించింది. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. టేబుల్ టెన్నిస్ లో ఫైనల్ కు చేరి పతాకాన్ని తన ఖాతాలో వేసుకోగా…ఈ రోజు గోల్డ్ మెడల్ కోసం జరిగిన పోటీలో ఓటమి పాలయ్యింది. చైనా క్రీడాకారిణి యింగ్ జావాతో భవీనా బెన్ పటేల్ 0-3 తేడాతో ఓడిపోయింది. దాంతో భవీనా రజతంతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.
ఇదిలా ఉంటే మొన్న బ్రెజిల్ కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్ లో 3-0తో అద్భుతమైన విజయం సాధించి భవీనా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. ఇక ఆ తరవాత భవీనా పటేల్ ప్రపంచ 2 చాంపియన్ రియో ఒలంపిక్స్ స్వర్ణ పతక విజేత రాంకోవిక్ తో జరిగిన పోరులో కూడా విజయం సాధించింది. ఇక ఈ రోజు ఫైనల్స్ లో ఓడినా కూడా భారత్ కు తొలిపతకం అందించి చరిత్ర సృష్టించింది. భవీనా విజయం పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.