RRR : ఆర్ఆర్ఆర్ నుంచి భీమ్ పోస్ట‌ర్ రిలీజ్‌.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక పండ‌గే

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి గా అంద‌రూ ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ ఆర్‌. ఈ సినిమాలో మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అలాగే… యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరో గా న‌టిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీగా అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ భీమ్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ వెరీ ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించారు. రెండు చేతుల్లో తాళ్లు ప‌ట్టుకుని… గాండ్రించిన‌ట్లు క‌నిపించారు భీమ్‌. ట్రైల‌ర్ మ‌రో మూడు రోజుల్లోనే విడుద‌ల కానున్న నేప‌థ్యంలోనే ఈ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news