క్యాప్షన్ లేకుండానే వచ్చేసిన “బీమ్లానాయక్”

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కూడా తిరిగి ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే.. వారం రోజుల కింద ఈ సినిమా మేకింగ్ వీడియో ను చిత్ర బృందం రీలిజ్ చేసింది.

ఈ మేకింగ్‌ వీడియోతో పవన్‌ ఫ్యాన్స్‌ కొత్త కోలహలం మొదలైంది. అయితే…. ఈ ఉత్సాహం నుంచి పవన్‌ ఫ్యాన్స్‌ తేరుకోకముందే… ఈ బీమ్లా నాయక్‌ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ గ్లింప్స్‌ తో పాటు… పవన్‌ సినిమా కు ”బీమ్లా నాయక్‌” అనే టైటిల్‌ కూడా అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఇక ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌ లో పవన్‌ లుంగీ గెటప్‌ లో అందరినీ అలరించాడు. అలాగే.. ఈ సినిమా ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించేసింది. ఇక ఈ అనౌన్స్‌ మెంట్‌ తో పవన్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news