BheemlaNayak : “భీమ్లా నాయక్” నుంచి బిగ్ అప్డేట్.. మందు బాటిల్ తో పవన్ రచ్చ!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా “భీమ్లా నాయక్” భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ను సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి కానుకగా ఈ అప్డేట్ను వదిలింది చిత్రబృందం. “లాలా భీమ్లా” అనే లిరికల్ సాంగ్ ను ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మేరకు ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ ను కూడా వదిలింది చిత్రబృందం. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో కనిపించారు. అలాగే ఓ మందు బాటిల్ ముందు పెట్టుకుని…. లుంగీ గెటప్ లో అందరినీ కనువిందు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news