గుప్పెడంతమనసు 2‍85: రిషీ కారుకు అడ్డంగా వెళ్లిన వసూ.. నన్ను ఎందుకు అవైడ్ చేస్తున్నారంటూ నిలదీత

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో కాలేజ్ లో రిషీ కారుదగ్గర నిలబడి ఉంటాడు. వసుధార, పుష్పా నడుచుకుంటూ వస్తారు. తన కన్ను ఎలా ఉందో ఏంటో అడుగుదాం అనుకుంటాడు. కానీ రషీకి వసుధార,శిరీష్ వస్తున్నట్లు కనిపిస్తుంది. అంతే కోపంతో వెళ్లిపోతాడు. ఆరోజు రాత్రి రిషీ అందరితో కలిసి భోజనం చేస్తుంటాడు. ఫణీంద్ర రిషీ నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అంటాడు. మహేంద్ర ఏంటి అన్నయ్య మళ్లీ మన కాలేజ్ కి ఏమైనా అవార్డు వచ్చిందా అంటాడు. డాడ్ చెప్పేవరకూ ఆగండి..ఎందుకు అడ్డుపడుతున్నారు అంటాడు. ఫణీంద్ర మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మనభూమి పేపర్ వాళ్లు ఒక ఆర్టికల్ రాసి పంపమన్నారు అని చెప్తాడు. రిషీ ఇది చాలా గుడ్ న్యూస్ పెద్దనాన్న అంటాడు. ఫణీంద్ర ఆర్టికల్ కూడా మనల్నే రాసి పంపమన్నారు అంటాడు. మహేంద్ర ఏముంది అన్నయ్య వసుధార రాస్తుందిలే అంటాడు. రిషీకి కోపం వస్తుంది. ఇదే ఛాన్స్ అని దేవయాని చెప్పు రిషీ..వసుధారకి చెప్పు. ఆ వసుధారో, జగతో రాస్తారు..వాళ్లిద్దరే కదా మన కాలజ్ కి దిక్కు అంటూ ఎక్కేస్తుంది. ఏం మహేంద్ర ఏం మాట్లాడవేంటి అంటుంది. నేను ఏం మాట్లాడినా మీరు దాన్ని ఖండించటానికి రెడీగా ఉంటారుగా అందుకే మాట్లాడను అంటాడు. దేవయాని మళ్లీ వాళ్లతోనే రాయించు రిషీ..వాళ్లిద్దరి కన్నాతెలివైన వాళ్లు ఎవరూ లేరు, మీరు అవునన్నా కాదన్నా ఇదే జరుగుతుంది అంటుంది. రిషీ ఆర్టికల్ వేరేవాళ్లతో రాయిద్దాం అంటాడు. మహేంద్ర వసుధార అయితేనే కరెక్టుగా రాస్తుంది అంటడు. రిషీ కాలేజ్ లో వసుధార ఒక్కతే తెలివైనదికాదు, ఇంకా చాలామంది ఉన్నారు, వసుధార రేపు పెళ్లిచేసుకుని వెళ్ళిపోతే కాలేజ్ మూసుకోలేం కదా అంటాడు. ఫణీంద్రను అడిగితే..సరే నీ ఇష్టం అంటాడు.

ఇంకోసీన్ లో వసుధార రిషీ పట్టుకున్న చున్నీని చూసి ఓ మురిసిపోతూ ఉంటుంది. తను కూడా అలానే ఆవిరిపడుతుంది. ఇంతలోనే జగతి వస్తుంది. ఏమైంది వసూ అంటే..వసూ ఏం లేదు మేడమ్ ఏం లేదు అంటుంది. వసూ కంటికి దెబ్బతగిలింది , రిషీ ఆవిరిపట్టింది చెబుతుంది. సర్ చిట్కా వైద్యం చేస్తుంటే నాకెంత ఆనందం వేసిందో అంటుంది. జగతి వసూ అన్నింటిని తీపి జ్ఞాపకాలుగా మలుచుకోవాలని చూడొద్దు..ఒక్కోసారి జ్ఞాపకాలన్నీ కుప్పుకూలితే..బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది.

మరోపక్క మహేంద్ర, ధరణి రిషీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ధరణీ రిషీ మనసులో ఏదో ఉన్నట్లే ఉంది, కానీ బయటకు చెప్పటంలేదు అంటుంది. మహేంద్ర రిషీ సంగతి మనకేం కొత్త కాదమ్మా, వాడు మూడ్స్ అప్పుడప్పుడు ఇలానే ఉంటాయ్ లే. ధరణి వసుధరా కాలేజ్ కి వచ్చాక రిషీలో చాలా మార్పు కనిపించింది అంటుంది. మహేంద్రకూడా అవునమ్మా అని ఏం జరిగిందని రిషీని గుచ్చి గుచ్చి అడగకు అంటాడు. నేను అసలు ఎప్పుడు అళా చేయను అని వెళ్తుంది. దేవయాని చూస్తుంది. ధరణీ మహేంద్రలు ఏం మాట్లాడుకుని ఉంటారు. వీళ్లిద్దరు ఏదైనా గూడుపుటానీ చేసి ఉంటారా అనుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం కాలేజ్ లో చెట్టు కింద కుర్చుని పుష్పా, వసూ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటారు. పుష్పా వసూ రింగ్ బాగుందని తీస్తుంది. అది కాస్త కిందపడి అటుగా వస్తున్న రిషీ కాళ్లదగ్గరకే వెళ్తుంది. వసూ పుష్పాని పంపిస్తుంది రిషీ దగ్గరకి. రిషీ..నీదా రింగ్ ఇలా పడేసుకుంటే ఎలా అంటాడు. పుష్పా నాది కాదుసార్, వసుధారది అంటాడు. రిషీ మళ్లీ కిందపడేస్తాడు. వసూ వచ్చి ఆ రింగ్ తీసుకుని చున్నీతో తుడుచుని పెట్టుకుంటుంది. రిషీ నీదా రింగ్ అంటే..వసూ అవును సార్..ఈ రింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమైన వాళ్లు ఇచ్చారు అంటుంది వసూ. రిషీకి కోపం వస్తుంది. పుష్పా ఓ సారి నా క్యాబిన్ కి రా అని చెప్పి వెళ్తాడు. పుష్పాకి రిషీ క్యాబిన్ కి ఒక్కతే వెళ్లటానికి భయమేసి వసూని కూడా తోడుగా తీసుకెళ్తుంది.

వసూని చూసిన రిషీ..పుష్పా నేను నిన్ను ఒక్కదాన్నే రమ్మన్నాను కదా అంటాడు. వసూ తను భయపడుతుంతే నువ్వు తోడువచ్చాను అంటుంది. రిషీ ఆహా నువ్వు వస్తావని అనుకున్నాను..రాకపోతే ఆశ్యర్యం అని మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి కొన్ని పాయింట్స్ పేపర్ మీద ఇద ఇచ్చి ఒక ఆర్టికల్ రాయమని పుష్పకి చెప్తాడు. పుష్ప బిత్తరపోయి అలానే చూస్తుది. వసూ నేను రాయనా అంటుంది. నేను పుష్పతో మాట్లాడుతున్నాను, నేను నిన్ను అస్సలు పిలవలేదు అంటాడు. మళ్లీ వసూని చూసి అంతలోనే..నీ కన్ను నొప్పి తగ్గిపోయిందా అంటాడు. వసూ ఆనందంగా తగ్గిపోయింది సార్ అంటూ కన్నుపై చేయి వేసి చూపిస్తూ ఉంటుంది. ఆ రింగ్ కనిపిస్తుంది. రిషీకి మళ్లీ మూడ్ మారిపోతుంది. జగతి మేడమ్, శిరీష్ లు కలిసి వసుధారను అమాయకురాలిని చేసి పెళ్లికి ఒప్పించారా, అయినా వసూకి సొంత అభిప్రాయం అంటూ ఏమి ఉండదా అనుకుంటాడు. వసూ కూడా క్యాబిన్ నుంచి బయటకు వెళ్తూ రిషీ వైపు చూస్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో వసూ రిషీ కారుకు అడ్డంగా వెళ్తుంది. రిషీ కారు దిగి..కారుకు ఎందుకు అడ్డం వచ్చావ్ అంటే..మీరు నన్ను ఎందుకు అవైడ్ చేస్తున్నారు, నాకు ఎందుకు వర్క్ ఇవ్వటం లేదు అంటుంది. నా వర్క నా ఇష్టం, అయినా కారుకు ఎందుకు అడ్డం వచ్చావ్ లిఫ్ట్ ఇవ్వాలా, అయినా ఇప్పుడు నీ రూట్ నా రూట్ మారిందిలే లిఫ్ట్ ఇవ్వలేను అంటాడు. చూద్దాం ఈ సస్ పెన్స్ కు ఎప్పుడు తెరపడుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news