BHELలో ఖాళీలు.. ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్(BHEL) నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు.

యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని చేయాల్సి వుంది. పని తీరుని బట్టి మరో ఏడాది పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశం వుంది. అప్లై చేసుకునేందుకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

కనుక ఈలోగా అప్లై చేసుకోవాల్సి వుంది. కార్పొరేట్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ గ్రూప్ లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మేనేజ్మెంట్ లో రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సు పూర్తి చేసినవారు అప్లై చేసుకోచ్చు.

ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక వయస్సు విషయానికి వస్తే.. వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. అలానే నవంబర్ 1, 2021 నాటికి కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని కూడా నోటిఫికేషన్ లో చెప్పారు.
నోటిఫికేషన్ లింక్: https://careers.bhel.in:8443/bhel/static/Advt_YP_CE09_2021.pdf

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news