అయ్యో పాపం బ్రో: “భోళా శంకర్” నిర్మాతకు రూ. 40 కోట్లు నష్టం

-

నిన్న చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా థియేటర్ లలో రిలీజ్ అయింది. అయితే ఆచార్య తరహాలోనే మొదటి షో నుండే డివైడ్ టాక్ రావడంతో రెండవ షో నుండే జనాలు థియేటర్ లలోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఫైనల్ గా ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే … సినిమా ప్లాప్, మెగాస్టార్ కెరీర్ లో మరో ఆచార్య అంటూ కంఫర్మ్ చేశేశారు. కాగా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు సమాచారం ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ కూడా అనుకున్నంతగా అమ్ముడుపోకపోవడంతో నిర్మాత అనిల్ సుంకరకు దాదాపుగా రూ. 40 కోట్ల వరకు నష్టాలు వచ్చాయట.

ఇక ఈ నష్టాలను పూడ్చడానికి చిరంజీవి సైతం ముందు రాలేదని తెలుస్తోంది. చాలా సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరున్న అనిల్ సుంకర ఒక్క సినిమాకే తలక్రిందులు అయిపోయాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news