ఈ సంవత్సరం చివర లేదా వచ్చే సంవత్సరం మొదట తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి, ఎన్నికల్లో గెలవడానికి అధికార BRS, కాంగ్రెస్ మరియు బీజేపీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కీలకమైన హామీలను తెలంగాణ ప్రజలకు తెలియచేశాడు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రూప్ 2 తో పాటుగా, టీచర్ పోస్ట్ లను భర్తీ చేస్తామని కోమటి రెడ్డి హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోగి రాగానే పార్టీలో నేనే కీలక నేతగా ఉంటానని ధీమాను వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. వచ్చే వారంలోనే బస్సు యాత్రను చేపడుతామని కోమటిరెడ్డి తెలియచేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు సీఎంగా ఉన్నప్పటికీ మొదటి సంతకం మాత్రం రూ. 2 లక్షల రుణమాపీ మరియు రూ. 4 వేల పెన్షన్ ల ఫైల్ మీదనే చేస్తామని కోమటిరెడ్డి భరోసాను తెలంగాణ ప్రజలకు ఇచ్చారు.
మరి కోమటిరెడ్డి కోరిక ప్రకారం కాంగ్రెస్ BRS ను దాటుకుని అధికారంలోకి వస్తుందా ? అన్నది సందేహంగానే చెప్పాలి.