బొలక్‌పూర్‌ గ‌ణ‌ప‌తి ల‌డ్డుకు ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్.. 8.1 లక్షలు పలికింది

-

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటోంది. వ‌చ్చే నాలుగైదు నెల‌ల్లో దేశాన్ని ఆర్థిక‌మాంద్యం ఓ ఊపు ఊపుతోంద‌న్న అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ఈ విష‌యం ఇప్ప‌టికే లీక్ అవ్వ‌డంతో పాటు సంకేతాలు కూడా వ‌స్తుండ‌డంతో ఎవ‌రికి వారు అలెర్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్ ఇప్ప‌టికే చాలా రంగాల‌పై ప‌డ‌గా… ఇది అనూహ్యంగా హైద‌రబాద్ గ‌ణ‌ప‌య్య ల‌డ్డూపై సైతం ప‌డింది.

హైద‌రాబాద్ వినాయ‌క‌చ‌వితి ఉత్సవాల్లో లడ్డూ వేలం తప్పనిసరి. ఈ వేలంలో కొన్ని లడ్డూలు లక్షలాది రూపాయలు పలుకుతాయి. బాలాపూర్ గ‌ణేషుడి ల‌డ్డూ నుంచి భోలాక్‌పూర్ ల‌డ్డూ ఇలా చాలా ల‌డ్డూల వేలం ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. భోలాక్ పూర్ లో శ్రీ వరసిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రతీ ఏడూ ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాల్లో బంగారు లడ్డు స్వామి చేతిలో ఉంచుతారు. ఈ ల‌డ్డూ సొంతం చేసుకునేందుకు భారీగా భ‌క్తులు పోటీ ప‌డి మ‌రీ రేటు పెడ‌తారు.

ప్ర‌తి యేటా మాదిరిగానే ఈ యేడాది కూడా 123 గ్రాముల బంగారు లడ్డూను 5 లక్షలు వెచ్చించి చేయించారు నిర్వాహకులు. ఆ లడ్డూను ఈరోజు వేలం వేశారు. భక్తులు పోటాపోటీగా ఈ వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. రూ. 5001తో ప్రారంభ‌మైన ఈ వేలం చివ‌ర‌కు 7.56 ల‌క్ష‌ల ద‌గ్గ‌ర ముగిసింది. స్థానిక చేప‌ల వ్యాపారి ఒక‌రు ఈ ల‌డ్డూ వేలంలో సొంతం చేసుకున్నారు.

గతేడాది 120 గ్రాముల బంగారు లడ్డును కే.భాస్కర్ అనే స్థానికుడు 8.1 లక్షలకు దక్కించుకున్నారు. కానీ, ఈసారి లడ్డు ధర తక్కువ పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్‌తోనే ఈ సారి రేటు బాగా త‌గ్గిన‌ట్టు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news