అలిగిన అఖిల ప్రియ టైం చూసుకుని బాబుకు దెబ్బ… జగన్ కే జై!

-

ప్రస్తుతం రాజకీయాల్లో చంద్రబాబు అంకం ఇక ముగియబోతోందనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! ప్రస్తుతం బాబు.. పార్టీ అధ్యక్షుడిగా ఏ నిర్ణయం తీసుకున్నా, దాన్ని అమలుచేయలేని పరిస్థితికి దిగజారిపోయారనే చెప్పాలి. ఆయన మాటలు విని… ఎమ్మెల్యేలు రాజినామాలు చేయడం లేదు, ఎంపీలు అయితే ఏకంగా ఎదురుప్రశ్నలే వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలు కూడా బాబు మాట వినడంలేదు!

ప్రస్తుతం అన్ కండిషనల్ గా 3 రాజధానుల బిల్లును చంద్రబాబు – నారా లోకేష్ – బోండా ఉమ – దేవినేని ఉమ – మరొకరిద్దరు నేతలు మాత్రం గట్టిగా విమర్శిస్తున్నారు. అంతకుమించి బాబు మాటకు విలువనిచ్చేవారు ప్రస్తుతానికి టీడీపీలో కనిపించడం లేదనే చెప్పాలి. ఈ క్రమంలో రాయలసీమపై పూర్తి పట్టుకోల్పోతున్న బాబుకు షాకిస్తున్నారు అక్కడి టీడీపీ నేతలు. ఈ క్రమంలో… భూమా అఖిల ప్రియ, “కర్నూలుకు హైకోర్టు ఇస్తున్నారంటే పార్టీలకు అతీతంగా స్వాగతిస్తాం” అని అన్నారు!

అవును… కర్నూలుకు హైకోర్టు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామంటే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును స్వాగతించినట్లే కదా! అలా కానిపక్షంలో అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలని డిమాండ్ చేయాలి. కానీ… సీమ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ నిర్ణయాన్ని కొందరు బహిరంగంగా, మరికొందరు తెరవెనుకా స్వాగతిస్తున్నారు. దీంతో రాయలసీమ ప్రాంతంలో బాబు పూర్తిగా పట్టుకోల్పోయినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అయితే… అఖిలప్రియకు ఉన్న ఆలోచనకానీ, సీమపై ప్రేమ కానీ చంద్రబాబుకి లేకుండా పోయాయని సీమ తమ్ముళ్లు వాపోతున్నారు. కాగా.. ఏవీ సుబ్బారెడ్డితో ఇష్యూ సమయంలో తనకు పార్టీనుంచి ఎలాంటి మద్దతు రాలేదని అలిగిన అఖిల ప్రియ… టైం చూసుకుని బాబుకు షాక్ ఇస్తున్నారనే కామెంట్లు సీమకేంద్రంగా వినిపించడం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Exit mobile version