మా అక్క భూమా అఖిల ప్రియ ను ఈ కేసులో వేధింపులకు గురిచేస్తున్నారని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్కొన్నారు. భూమా ఫ్యామిలీని ఆర్థికంగా , రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన మాపై ఏపీ , తెలంగాణ లో అక్రమ కేసులు పెట్టి వేదింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో మా వాళ్ళ ప్రేమయం లేకున్నా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హఫీజ్ పేట్ 25 ఎకరాల భూమి మాదేనన్న ఆయన ఆస్తులు కాజేయలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
మా అక్క కు ఆరోగ్యం బాగులేక ఇబ్బంది పడుతున్న ఇంకా వేధిస్తున్నారని, మాకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నామని అన్నారు. తల్లిదండ్రులు లేని మమ్మల్ని టార్గెట్ చేసి ఆస్తులు లాక్కుంటున్నారని, కుట్ర పూరితంగా కేసులు పెట్టి ఇరికించారని అన్నారు. హైదరాబాద్ లో కేసు నమోదైతే ఆళ్ల గడ్డలో మా అనుచరులను వేధిస్తున్నారని అన్నారు. కిడ్నాప్ కేసులో ఎఫ్ ఐ ఆర్ లో పేర్లు ఉన్న వారందరు కూడా కిడ్నాప్ సమయంలో ఎక్కడా ఉన్నారో పోలుసులు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మా ల్యాండ్ కబ్జా చేసి మై హోమ్స్ కు లీజ్ కి ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు.