గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా బిజెపి సీనియర్ నేత నరేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. కాసేపటి క్రితమే భూపేంద్ర పటేల్ తో… గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ వ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలోనే… తాను రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటానని… ప్రజలకు సమన్యాయం అందించేలా వ్యవహరిస్తానని భూపేంద్ర పటేల్… గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అంతేకాదు కేంద్ర బిజెపి నాయకత్వం తనపై నమ్మకం ఉంచి ఈ పదవి కట్టబెట్టి నందుకు ధన్యవాదాలు తెలిపారు కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. బిజెపి నాయకత్వం నమ్మకాన్ని…తాను తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఇక ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నేతలు మరియు కేంద్ర నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఇవాళ అ భూపేంద్ర పటేల్ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా… సీఎం పదవికి విజయ్ రూపాని రాజీనామా చేయడంతో భూపేంద్ర నా స్థానంలో గుజరాత్ సీఎంగా బిజెపి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.