Ration Cards: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి ప్రక్రియ

-

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందజేశారు. చాలా రోజుల నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేశారు. గురువారం రోజున సచివాలయంలో జరిగిన సమావేశంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల అంశంపై రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

revanth reddy on new ration card

అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులను అక్టోబర్ మొదటివారంలో తీసుకొని నెల చివరి వరకు అర్హుల జాబితాను ఫైనల్ చేసి కార్డులని లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. అయితే ఈ అంశంపైన త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోసారి సమీక్షించి విధి విధానాలు ఫైనల్ చేయడంతో పాటుగా ఎప్పటి వరకు రేషన్ కార్డులను జారీ చేయాలన్నది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version