Big alert: తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షము పడే అవకాశం

-

తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను వాతావరణ శాఖ విడుదల చేసింది.భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గోవా, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు,రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌తో సహా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అస్సాం, మేఘాలయ,త్రిపుర, బీహార్, ఒడిశా, జార్ఖండ్, యూపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version