భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అమితాబచ్చన్. అయితే కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా అమితాబచన్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు అందరూ తీవ్ర ఆందోళన చెందారు. అమితాబచ్చన్ కరోనా వైరస్ బారిన పడిన నుంచి తొందరగా కోలుకోవాలి అంటూ ఎంతో మంది అభిమానులు ప్రార్థనలు చేశారు.
కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియా వేదికగా… కరోనా వైరస్ తో అమితాబ్ చనిపోవాలి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం అమితాబ్ దృష్టికి రావడంతో తన బ్లాక్ వేదికగా స్పందించిన అమితాబ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ అజ్ఞాత వ్యక్తి… మీరు మీ తండ్రి పేరు రాయలేదు.. ఎందుకంటే మీ తండ్రి ఎవరో మీకు తెలియదు.. నేను ఒకటి చెబుతున్న ఏవైనా రెండు విషయాలు జరగొచ్చు… నేను చనిపోతాను లేదా బ్రతుకుతాను ఒకవేళ నేను చనిపోతే సెలబ్రిటీ పై దూషణలకు దిగరు.. ఒకవేళ దేవుడి దయవల్ల నేను బ్రతికి ఉంటే నేను మాత్రమే కాకుండా 90 మిలియన్ ఫాలోవర్స్ నుండి కూడా మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది… ఆ సమయంలో దీని పై నువ్వే పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమితాబ్.