Big Boss OTT Telugu: ఎలిమినేషనే టార్గెట్..ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్ పదో వారంలోకి ఎంటరయింది. కంటెస్టెంట్స్ అందరూ తమ గేమ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టి ఆడుతున్నారు. తాజాగా బుధవారం నాటి 66వ రోజు ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సదరు ప్రోమో నెట్టింట బాగా వైరలవుతోంది.

ఆ ప్రోమో ద్వారా బుధవారం బిగ్ బాస్ ఇంటికి స్పెషల్ గెస్ట్ గా మానస్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్..గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ తో మానస్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులు డిస్కషన్ స్టార్ట్ చేశారు. బాబా భాస్కర్ మాస్టర్ మాట్లాడుతూ తాను అమ్మాయిని అయితే, తనకు పొడవాటి జుట్టున్న వ్యక్తి మొగుడిగా రావాలని ఇన్ డైరెక్ట్ గా నటరాజ్ మాస్టర్ ను ఉద్దేశించి మాట్లాడాడు.

అనంతరం నటరాజ్ మాస్టర్ తనకు కడుపు నొప్పి లేస్తున్నదని, వికారం వస్తున్నదని అనడంతో బిందు మాధవి బాబా మాస్టర్ ను ఏం చేశారు మాస్టర్? అని డబుల్ మీనింగ్ భాషలో అడుగుతుంది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ టాస్కు స్టార్ట్ అవుతుంది. ఈ టాస్కు గురించి మానస్ వివరించాడు.‘‘బజర్ వచ్చినపుడు.. ఎవరైతే వెళ్లి హ్యాండ్ కర్చీఫ్ ను టచ్ చేస్తారో వారు తమకు ఎవరు నచ్చితే వారిని ఎలిమినేట్ చేయొచ్చని చెప్తాడు’’.

దాంతో కంటెస్టెంట్స్ అందరూ అలర్ట్ అయిపోతారు. అంతలో బజర్ సౌండ్ రాగానే, అందరూ పరిగెత్తుకెళ్లి హ్యాండ్ ఖర్చీఫ్ టచ్ చేయబోతారు. అంతటితో ప్రోమో ముగుస్తుంది. ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ ఈ టాస్కు ద్వారా ఉన్నాయి? అనేది తెలియాలంటే బుధవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version