క్రికెట్ అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసే టోర్నీ ఐపిఎల్. ఈ టోర్నీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ టోర్నీ ఎప్పుడు కూడా మార్చ్ చివరి వారం నుంచి మొదలవుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అది వాయిదా పడింది. ఏప్రిల్ 15 నుంచి నిర్వహించే అవకాశం ఉందని భావించారు అందరూ కూడా. కాని అనూహ్యంగా కరోనా వైరస్ ప్రభావం పెరగడం తో ఇప్పటి నుంచి కూడా టోర్నీ లేదు అనే చెప్పాలి.
ఇక ఐపిఎల్ ని ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. ఐపిఎల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు… అయినా సరే అది ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు కనపడటం లేదు. తాజాగా మీడియా కు వచ్చిన సమాచారం ప్రకారం ఐపిఎల్ ని ఈ ఏడాది రద్దు చేసారని అంటున్నారు. ఈ ఏడాది ఈ టోర్నీ నిర్వహించడం దాదాపుగా కష్టమనే అభిప్రాయం వినపడుతుంది. ఈ టోర్నీ లో పాల్గొనే జట్లకు చెందిన…
విదేశీ ఆటగాళ్ళు ఎక్కువగా కరోనా ప్రభావం ఉన్న దేశాల్లోనే ఉన్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల ఆటగాళ్ళు ఈ టోర్నీ లో పాల్గొనాల్సి ఉంది. కాని ఇప్పుడు అది సాధ్యం కాదు. విదేశీ ఆటగాళ్ళు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు. ఇక టి20 ప్రపంచ కప్ స్థానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. కాని దాని షెడ్యుల్ ని మార్చే అవకాశం లేదని ఐసిసి స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో రద్దు అయింది అంటున్నారు.