ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ తాడేపల్లి లోని సీఎం నివాసంలో కలవడం జరిగింది. ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ చాలా లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఈ భేటీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం అన్న విషయంపైనా ప్రధానంగా చర్చ జరగనుందని సమాచారం బయటకు వస్తోంది. పెట్టుబడులు మాత్రమే కాకుండా మరికొన్ని అంశాల పైన కూడా చర్చించే లా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ సీఎం అయ్యాక తనకు సహాయపడుతున్న అతి కొద్ది మంది పారిశ్రామికవేత్తలతో గౌతమ్ అదానీ ఒకరు అని చెప్పాలి. చాలా సేపటి వరకు జగన్ మరియు అదానీల మాట్లాడుకునే తర్వాత డిన్నర్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇక రాజకీయాలు, చంద్రబాబు అరెస్ట్, కేంద్రం లాంటి పలు కీలకమైన విషయాల గురించి కూడా అదానీ చర్చించే అవకాశం లేకపోలేదు. వచ్చే ఎన్నికలలోనూ వైసీపీకి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నందున మెల్ల మెల్లగా పెద్ద పారిశ్రామిక వేత్తలు జగన్ ను బుట్టలో వేసుకోవడానికి చూస్తున్నారట ?