విదేశాల్లో 90 శాతం బిచ్చగాళ్ళు పాకిస్తానీలే !

-

తాజాగా ఒక విషయం పాకిస్తాన్ దేశస్థులకు షాక్ ఇస్తోందని చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళితే, సహజంగా ప్రతి దేశాల్లో కూడా బిచ్చగాళ్లు ఉంటారు.. ఇంట్లో పరిస్థితులు బాగోలేక, లేదా వృద్ధాప్యంలో ఉండో యాచక వృత్తిని అనుసరిస్తారు. తాజాగా ఒక ప్రకటన ప్రకారం తెలుస్తున్నది ఏమిటంటే.. విదేశాలలో ఉన్న బిచ్చగాళ్ళలో దాదాపుగా 90 శాతం మంది పాకిస్తాన్ దేశానికి చెందినవారేనని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది చెప్పింది ఎవరో కాదు పాకిస్తాన్ ప్రభుత్వమే. ఈ ప్రకటనతో పాకిస్తాన్ ప్రజలు అంతా షాక్ కు గురవుతున్నారు. అంతే కాకుండా విదేశాలలో జేబు దొంగలుగా మారుతున్న వారిలోనూ పాకిస్తాన్ పౌరులు ఉన్నారంటూ తెలపడం మరో విశేషం.

ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలలో పాకిస్తాన్ కు చెందిన దేశస్థులు బిచ్చమెత్తుకుంటూ అరెస్ట్ అయ్యారని ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. పాకిస్తాన్ నుండి వీరంతా టూరిస్ట్ వీసా మీద బయట దేశాలకు వెళ్లి అక్కడ యాచకులుగా మారుతున్నారని రిపోర్ట్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version